పేదోడి సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

*పేదోడి సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం*

*జమ్మికుంట జూన్ 9 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 5వ,8వ,22వ వార్డులలో ఇందిరమ్మ ఇoడ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసి నిర్మాణ పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతుందనీ అన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆరు గ్యారంటిలను అమలు చేస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ కి, నియోజవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకర రమేష్ జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు,పూదరి రేణుక శివకుమార్ గౌడ్, ఎండి సజ్జు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుల్లి ప్రతాప్, పాతకాల ప్రవీణ్, అనిల్,ఐదవ వార్డు అధ్యక్షుడు అశోక్ చంచల శ్రీనివాస్, ములుగురి రమేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment