” ఆరేషన్ సిందూర్ కి ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది – సత్యం శ్రీరంగం.”
ప్రశ్న ఆయుధం మే20: కూకట్‌పల్లి ప్రతినిధి
” రాహుల్ గాంధీ దేశ భక్తిని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదు – సత్యం శ్రీరంగం.”
” భారతదేశ మేధావులు, సైనికాధికారులు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలే రాహుల్ గాంధీ సంధించారు – సత్యం శ్రీరంగం.”
” సామాజిక తెలంగాణ సాధించడం కోసం కవితక్క BRS ని విడి వెంటనే పార్టీని పెట్టాలి – సత్యం శ్రీరంగం.”
” కాంగ్రెస్ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లతో వాటి ఫలాలను తెలంగాణ ప్రజలు సవిచూస్తునారు – సత్యం శ్రీరంగం.”
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడుతు, ట్విట్టర్లో అభ్యంతరంగా పోస్టులు పెడుతున్నారు అని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆరేషన్ సిందూర్ గురించి ముందుగానే పాకిస్తాన్ కి తెలియజేసాం అని విదేశాంగ శాఖ మంత్రి చెప్తే దేశ ప్రజలకు అనుమానం రాదా….ఆపరేషన్ సింధూర్ పై దేశ ప్రజలకు తెలియజేయమని అత్యవసర పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని రాహుల్ గాంధీ చెప్పడం తప్ప అని, ఆపరేషన్ సింధూర్ పై సామాన్యులకు కూడా అనుమానాలు ఉన్నాయి అవి నివృత్తి చేయాలని చెప్పడం తప్పా…ఆపరేషన్ సిందూర్ పై బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు అని, ఇందిరాగాంధీ పరిపాలన ను ఈ రోజు దేశ ప్రజలు గుర్తుచేకుంటున్నారు అని అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలన స్వర్ణ యుగం అని, ఆమె తీసుకున్న ప్రతిష్ఠమైన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మహిళగా గుర్తింపు తెచ్చుకుంది అన్నారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాల ముందు మీ కుప్పి గంతులు చిన్నవి. ఈ రోజు దేశంలో మేధావులు, మాజీ సైనికాధికారులు, సామాన్య ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఆరేషన్ సిందూర్ కి ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీ సంపుర్ణ మద్దతు తెలియజేసారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, రాహుల్ గాంధీ దేశ భక్తి మీద మాట్లాడే అర్హత కిషన్ రెడ్డి, మోడీ కి కూడా లేదు. వెంటనే కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ కి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ దొంగ డిక్లరేషన్ ఇచ్చారని హరీశ్ రావు సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు, 16 నెలలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్ తో తెలంగాణ ప్రజలు ఫలాలు పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషనర్లను నిర్వీర్యం చేస్త నేడు అన్ని కమిషనర్ లకు చైర్మన్లను ఏర్పాటు చేశాం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది 10 ఏళ్ళు అన్ని వర్గాలను మోసం చేస్తూ దారుణమైన పరిపాలన చేశారు అని, దోచుకున్న సొమ్ముతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులగొట్టడానికి కేటిఆర్ హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిక్షణము ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు అన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి కవిత మురిసి పోతుందని సామాజిక తెలంగాణ కోసం కవితక్క కొత్త పార్టీ పెట్టాలి అని అన్నారు. నీళ్లు, నిధులు నియామకాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగి రాష్ట్రం ఏర్పాటు అయిందని, కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతియే లక్ష్యంగా పాలన జరిగిందన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా విధ్వంసం చేశారని విమర్శించారు. భవిషత్ ప్రణాళికలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్ల కి 500 బోనస్, నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి పథకాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహిళల చేత ఆర్టీసీ బస్సుల కొనుగోలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ అందిస్తున్నాం అన్నారు.