కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి..
కామారెడ్డి జిల్లా బిక్కనూర్
(ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 04:
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు భిక్కనూర్ లో ఆయనకు కాంగ్రెస్ చేను పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర పిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి సుదర్శన్ దయాకర్ రెడ్డి లింబాద్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.