అంబేద్కర్ ను పార్లమెంటులో అడుగుపెట్టకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ

*అంబేద్కర్ ను పార్లమెంట్లో అడుగు పెట్టకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ*

*కపట ప్రేమలను ఆపాలని రాజ్యాంగాన్ని పరిరక్షించేది బిజెపి యే*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కన్నె కృష్ణ*

*జమ్మికుంట ఏప్రిల్ 9 ప్రశ్న ఆయుధం*

భారతీయ జనతా పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కన్నె కృష్ణ మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలు కలిసి జెండా ఎగురవేసి, బిజెపి జెండాలతో వాడ వాడాలో ర్యాలీ నిర్వహించాలని, బిజెపి పార్టీ ఈ నలభై ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ దేశానికి చేసిన సేవలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం బిజెపి పార్టీ మాత్రమే అని, అంబేద్కర్ కాంగ్రెస్ పాలనలో ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపి అంబేద్కర్ పార్లమెంటు లో అడుగు పెట్టకుండా అడ్డుకుందని, కాంగ్రెస్ అరవై సంవత్సరాల పాలనలో కనీసం అంబేద్కర్ కి భారత రత్న అవార్డు కూడా ఇవ్వలేదని ఇప్పుడు అంబేద్కర్ ఫోటో పట్టుకొని రాజకీయం చేస్తుందని ఇది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు కపట ప్రేమలను ఆపాలని హెచ్చరించారు ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్ ఈరోజు ఉగ్రవాద దాడుల లేకుండా ప్రశాంతంగా ఉందని, పర్యాటక కేంద్రకంగా నాలుగు సంవత్సరాలలో ఉహించని విధంగా అభివృద్ధి చెందిందని, త్రిపుల్ తలాక్ తొలగించి ముస్లిం మహిళలకు అండగా నిలిచిందని, నరేంద్ర మోడీ పండిత్ దీన్ ధయాల్ ఉపాద్యాయ సిద్దాంతాన్ని నమ్మి అటల్ బిహారీ వాజపేయి అద్వానీ ఇద్దరు కలిసి బిజెపి పార్టీ ని 1980 ఏప్రిల్ 6 తేదీన స్థాపించబడిందని దానిని ఇప్పుడు నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, రాజేష్ ఠాకూర్, కొరె రవిందర్, మోతె స్వామి, కైలాసకొటి గణేష్, బచ్చు శివన్న, కొమ్ము అశోక్, రాచపల్లి ప్రశాంత్, వేముల జగన్, శ్రీవర్తి ప్రవీణ్, అఖిల్, ఇటుకాల స్వరూప, నిరుపరాణి, కేస స్వరూప, కనుమల్ల లక్ష్మి, భాగ్య, రాకేష్ ఠాకూర్, బూరుగుపల్లి రాము, యాంసాని సమ్మయ్య, ఎర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment