ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు ఉపాధి కల్పనా లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎంఎస్‌ఎంఈ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అందిస్తున్న అనేక రకాల పథకాలను ప్రజలకు నిరుద్యోగ యువతీ యువకులకు చేరువ చేసే దిశగా అధికారులు ప్రజాప్రతినిధుల మైన మేము దిశగా పనిచేస్తున్నాం అని
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎంఎస్‌ఎం, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారు లతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు లోన్లు రుణాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు.గత ఎన్నికల్లో చిన్న హామీ మేరకు అచ్చంపేట నియోజకవర్గంలోని యువకులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో చిన్న మద్దతురః పరిశ్రమల ఏర్పాటు మొదలైన అంశాలపై గత నెలల్లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో అవగాహన శిక్షణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కృషితోనాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల ఆర్థిక అభ్యున్నతికీ బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.దీనికి ప్రత్యేక చొరవ తీసుకొని ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు.
సీఎస్‌ఆర్ నిధులతో విద్యా, వైద్యానికి ఖర్చు చేసి మెరుగైన వసతులు అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టెలికాం అడ్వైజర్ బోర్డ్ సభ్యులు రాము యాదవ్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , మాజీ ఎంపీపీ రామనాథం,ఉప్పునుంతల మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, నరసింహారెడ్డి ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.