మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ మహిళా నేత

*మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ మహిళా నేత*

*జమ్మికుంట జులై 4 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డుకు చెందిన అల్లపు చంద్రయ్య ఇటీవల మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న ఎనిమిదవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిడుగు భాగ్య మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన అల్లపు లక్ష్మి కి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన అల్లపు లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment