ఒకేచోట ఐదు మంది గురుమూర్తుల దర్శనం కోసమే గూడూరులో శ్రీగురుపీఠం నిర్మాణం…..

●శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్..

●దుర్మార్గులను సన్మార్గంలో నడిపించిదే దత్తాత్రేయ అవతారమని వెల్లడి..
సనాతన ధర్మాన్ని పాటించడమే మనందరి కర్తవ్యమని సూచనలు..

●గురుపౌర్ణమి సందర్బంగా శ్రీదత్తాత్రేయస్వామి, షిరిడి సాయినాథునికి విశేష అభిషేకములు..

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ఆషాడ మాసంలో వచ్చే గురుపౌర్ణమి పరమపవిత్రమైనదని వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమగా భావించడంగా గురువులను పూజించుకొనేదే గురుపౌర్ణమిగా కోలుచుకోవడం జరుగుతుందని శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గురుపౌర్ణమి సందర్బంగా అమ్మవారి ఉపాసకులు, ట్రస్టు సభ్యులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించి శ్రీదత్తాత్రేయస్వామికి, షిరిడీ సాయినాథునికి అర్చన,విశేషమైన అభిషేకములు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వామివారి తీర్థప్రసాదలను అందజేశారు. అనంతరం భక్తులకు శివకుమార్ గౌడ్ – రమాదేవి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
@@ సనాతన ధర్మాన్ని పాటించడమే మన కర్తవ్యం.. శివకుమార్ గౌడ్.. @@
దత్తాత్రేయ అవతారమనేది సనాతనమైనదని, అలాంటి సనాతన ధర్మాన్ని పాటించడమే మనందరి కర్తవ్యమని శ్రీగురుపీఠం ట్రస్టు చైర్మన్ శివకుమార్ గౌడ్ అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ చీకటి నుండి వెలుగులోకి రావడమే అద్వయితమని,ఐదు మంది గురువులందరికి ఒకే చోట గుడి నిర్మించాలనే తపనతో గుంటూరు శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఆశీస్సులతో శ్రీగురుపీఠం నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలోనే ఎక్కుడ లేని విదంగా ఇక్కడ ఐదు మంది గురుమూర్తులు ఒకే గర్భలయంలో దర్శమిస్తారని ఆయన తెలిపారు.దుర్మార్గులను సన్మార్గంలో నడిపించడమే దత్తాత్రేయస్వామి లక్ష్యమని, దత్తాత్రేయ అవతారనికి ఎక్కడ ముగింపే లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీగురుపీఠం నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసి నవంబర్ నెలలో విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.అనంతరం గురుపౌర్ణమి సందర్బంగా అమ్మవారి ఉపాసకులు లక్ష్మీ వెంకటేశ్వర శర్మ గురు దంపతులకు పండ్లు, పూలు, నూతన వస్త్రాలను శివకుమార్ గౌడ్ – రమాదేవి దంపతులు సమర్పించి గురు దీవెనలలు అందుకొన్నారు.ఈకార్యక్రమంలో గురుపీఠం ప్రధాన అర్చకులు బిందు సంతోష్ కుమార్, తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గౌడ్, ఉమాలక్ష్మీకాంతారావు, జిన్నారం శ్రీనివాస్ గౌడ్, పత్రాల శ్రీనివాస్ గౌడ్,ట్రస్టు సభ్యులు జిన్నారం పెద్దగౌని సూర్యం కుమార్ గౌడ్, రాజ్యం బిక్షపతి యాదవ్, గొల్ల యాదయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, గొల్ల రాములు, జంగం వెంకటేష్, కొడకంచి రవీందర్ గౌడ్, భాస్కర్ గుప్త, బోయిని మహేష్ యాదవ్, బల్కంపేట భాస్కర్, కిషన్ నాయక్, బ్యాగరి నర్సయ్య, ఆంజనేయులు,అడ్వకెట్ వజ్జ హన్మంతు, సాయికుమార్, విశ్వశ్రీ లా ఛాంబర్స్ సీఎఓ లిఖిత, నల్లపల్లి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి (చిన్న ), కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, స్వామివారి భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now