మార్వాడీలపై నియంత్రణ చట్టం తీసుకురావాలి – వృత్తిదారుల హెచ్చరిక

మార్వాడీలపై నియంత్రణ చట్టం తీసుకురావాలి – వృత్తిదారుల హెచ్చరిక

ఉపాధి కోల్పోతున్న చేతివృత్తులను కాపాడాలని డిమాండ్

గజ్వేల్‌లో బంద్ విజయవంతం – దళిత, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యం

“మార్వాడీలు నకిలీ వస్తువులతో స్థానికుల పొట్ట కొడుతున్నారు” – నేతల విమర్శ

స్వర్ణకారులు, విశ్వకర్మలు, పద్మశాలులు, వైశ్యుల ఉపాధి సంకటంలో

మార్వాడి షాపుల్లో స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరి చేయాలని డిమాండ్

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఓయూ జేఏసీ పిలుపు మేరకు జరిగిన తెలంగాణ బంద్‌లో చేతివృత్తుల కళాకారులు, దళిత సంఘాలు బలంగా పాల్గొన్నారు. “మార్వాడి గో బ్యాక్” నినాదాలతో బంద్ విజయవంతమైంది.

ఈ సందర్భంగా దళిత రత్న వాడు గ్రహీత పొన్నల కుమార్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండ స్వామి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలచారి, మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకటచారి మాట్లాడుతూ – “మార్వాడీల దోపిడీతో తెలంగాణ సొమ్ము ఇతర రాష్ట్రాలకు కొల్లగొట్టుకుపోతోంది. స్థానిక వృత్తులు క్షీణించి, బీసీలు–ఎస్సీల కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి” అన్నారు.

మార్వాడీలు నకిలీ వస్తువులు అమ్ముతూ, తెలంగాణ అణగారిన వర్గాల జీవనాధారాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. “స్వర్ణకారులు, విశ్వకర్మలు, పద్మశాలులు, వైశ్యులు, మొబైల్ షాపుల వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారు. చిన్న చిన్న బజార్లలోనూ మార్వాడీలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు” అని వాపోయారు.

“రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్వాడి వ్యాపార నియంత్రణ చట్టం తీసుకురావాలి. వారి షాపుల్లో స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరి చేయాలి. వ్యాపార పత్రాలు తెలుగు–ఇంగ్లీష్‌లో ఉండేలా నిబంధనలు చేయాలి” అని నేతలు డిమాండ్ చేశారు.

అలాగే బంద్ సందర్భంగా అరెస్టు చేసిన తెలంగాణ ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బంద్ విజయవంతం కావడంలో సహకరించిన గజ్వేల్ పట్టణ వ్యాపారులకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతజు ఆంజనేయులు, మురళి చారి, రమేష్ చారి, రామచంద్ర చారి, ముత్యాల విఠలాచారి, అరుణోజి లక్ష్మీనరసింహ చారి, శివ, పన్నీర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment