జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో మాట్లాడి డ్రైనేజీ పూడికను క్లియర్ చేయించిన కార్పొరేటర్..
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గణేష్ నగర్ లో డ్రైనేజీ లైన్ నిండిపోయి పొంగుతుదన్న విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో ఎయిర్ టెక్ యంత్రం సహాయంతో పూడికను క్లియర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి కాలనీకి రోడ్లు మరియు డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. రానున్న వినాయక మహోత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియచేసారు. కార్యక్రమంలో సంతోష్ ముదిరాజ్, శివరామకృష్ణ, నర్సింగ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు…