ప్రేమజంట ఆత్మహత్య కలకలం

ప్రేమజంట ఆత్మహత్య కలకలం

ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 21, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపెట్ వేరు వేరు మండలాలలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసుకోగా, దోమకొండ మండలం అంబారీపేట్‌ గ్రామానికి చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు..

Join WhatsApp

Join Now