Site icon PRASHNA AYUDHAM

సిపిఎం ఉద్యమానికి తిరనిలోటు…

కామ్రేడ్ బగ్యారి శంకర్ మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటు

 

 

 సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ 

 

యాదాద్రి భువనగిరి 

ప్రశ్న ఆయుధం 

 సెప్టెంబర్ 23 

సిపిఎం సీనియర్ నాయకులు, జమీలాపేట సిపిఎం శాఖ మాజీ కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం బీబీనగర్ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ బగ్యారి శంకర్ మృతి ఈ ప్రాంత సిపిఎం ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని జమీలాపేట సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాఖ కార్యదర్శి బగ్యారి శంకర్ అకాల మృతికి సిపిఎం గ్రామ మండల కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్ శంకర్ పార్థివ దేహానికి ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి సంతాపాన్ని ప్రకటించినారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ శంకర్ జమీలపేట, రాయరావుపేట, జియాపల్లి గ్రామాలలో సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలకంగా పనిచేసినారని అన్నారు. బీబీనగర్ మండల వ్యాప్తంగా గ్రామ గ్రామనా వ్యవసాయ కూలీలను సమీకరించి కూలి రేట్లు పెంచాలని, రైతుల దగ్గర జీతాలున్న జీతగాల్ల సంఘాలను నిర్మాణం చేసి నెలనెల జీతం పెంచాలని పెద్ద ఎత్తున సిపిఎం మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలలో, సమ్మేళల్లో పాల్గొని ముందు పీఠానా ఉండి కూలి రేట్లు పెంపు ఉద్యమంలో ముందుండి పని చేశారని అన్నారు. 1998 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధన కోసం జరిగిన ఉద్యమాలలో కూడా శంకర్ పాల్గొని పని చేశాడని అన్నారు. తన జీవితాంతం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా సిపిఎం నాయకత్వంలో కార్యకర్తగా, శాఖ కార్యదర్శిగా పనిచేసిన గొప్ప నాయకుడ శంకరని నర్సింహ తెలియజేశారు. వారి మృతి సిపిఎంకు, వ్యవసాయ కార్మిక సంఘానికి తీరని లోటని వారి అకాల మృతికి సిపిఎం జిల్లా కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి రేసు రామచంద్రారెడ్డి, మండల కమిటీ సభ్యులు ఎరుకలి బిక్షపతి , మండల నాయకులు బండారు శ్రీరాములు, ఎరుకలి ఎల్లయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version