*లగచర్ల భూ పోరాట వాసులకు అండగా సిపిఎం పార్టీ ఉంటుంది*
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం లో జరిగినటువంటి సంఘటనను అక్కడి ప్రజలకు అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి వివరిస్తామని లాగచర్ల సందర్శనకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మద్దూరు మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఈ సందర్భంలో సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టడం అలాగే ఆ ప్రాంతం ప్రజలను భయాందోళన గురి చేయడం తగదన్నారు అక్కడి ప్రజలను వారు కోరుకుంటున్నదేంటి వారి సమస్య ఏంటి అని తెలుసుకోవడం కోసం సందర్శించే కార్యక్రమం పెట్టుకుంటే ఈ కార్యక్రమాన్ని అడ్డగిస్తూ ముందస్తుగా నాయకులను అరెస్ట్ చేసి ఆపాలని చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందన్నారు సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి అక్కడి ప్రజలకు అండగా ఉండి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని మరియు ఆ ప్రాంత ప్రజలు కోరుకునే విధంగా పోరాటాలు చేస్తుందని ఎదవ పలికారు మా పార్టీ నాయకులు ముందుగానే చెప్పారు మముల్ని అడుగిస్తే ప్రజాపోరాటం ఉద్రిక్తంగా మారుతుందన్నారు కాబట్టి ఈ అక్రమ అరెస్టులను మానుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అశోక్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ సిపిఎం పార్టీ మద్దూరు మండల నాయకులు హనుమంతు డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు….