*గత సంవత్సరం కంటే ఈ ఏడాది మహిళా క్రైమ్ రేట్ తగ్గింది*
*2024 నేర నివేదిక విడుదల*
*సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించేందుకు జిల్లాకు నాలుగు డి.ఫోర్.సి లు ఏర్పాటు*
*జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్)*
ప్రశ్న ఆయుధం ,నల్లగొండ డిసెంబర్ 28:
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఎక్కువగా నమోదు, మహిళా క్రైమ్ రేట్ తగ్గింపు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. వివరాల ప్రకారం:2023 సం..తో పోలిస్తే నల్గొండ జిల్లా క్రైమ్ రేట్ 778 కేసులు ఎక్కువగా నమోదు తీవ్రమైన కేసులు గత సంవత్సరం 185 ఈ సంవత్సరం 211, ఆస్తికోసం ఆత్మహత్యలు 05, రాబరీ కేసులు గత సంవత్సరం 2 ఈ సంవత్సరం 10 కేసులు నమోదు, మిస్సింగ్ కేసులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గాయి గత సంవత్సరం 522, ఈ సంవత్సరం 476.గాంజా 2023-655 కేజీ లు 19 కేసులు 46 మంది 2024 -794 కేజీలు 124 మంది పై 34 కేసులు నమోదు.మహిళలపై నేరాలు 2023-709,2024-655 గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తక్కువగా నమోదు.

భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన షీ టీం సమర్థవంతంగా పనిచేస్తున్నాయి జిల్లాలో మూడు సబ్ డివిజన్లో వారిగా అధికారులు షీ టీం ఏర్పడి పనిచేస్తుంది షీ టీం ద్వారా 460 అవగాహన ప్రోగ్రాంలో కండక్ట్ చేశారు. షీ టీం ద్వారా 6 కేసులు నమోదు. మహిళా భరోసా సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 108 మంది మెంబర్స్ కు కౌన్సెలింగ్. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్ల సమస్య అధికమవుతుంది నేరాల నుండి ప్రజలను విముక్తి కల్పించాలని లక్ష్యంతో అదనపు డీజీపీ సియా గోయల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాకు నాలుగు ఫోర్ డి సి లు ఏర్పాటు చేశారు. డీఎస్సీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు పెంచడం రోడ్డు మరణాలను నియంత్రించాలని లక్ష్యంతో ఒక్కొక్క మండలానికి ఒక్కో అధికారి దత్త తీసుకోవడం జరిగింది జిల్లా ఎస్పీ నల్గొండ మండలం ను, వేములపల్లి మండలాన్ని అడిషనల్ ఎస్పీ, కేతపల్లి మండలాన్ని డిఎస్పి, మిర్యాలగూడ మండలాన్ని డిఎస్పి దత్తత తీసుకొని ఫీడ్బకర్లు మార్కెట్లు అవగాహన సదస్సులు చేపట్టడం జరిగినది.దొంగతనాల కేసులో సొమ్ము రికవరీ 2023-41 శాతం, 2024-56 శాతం రికవరీ.ఎక్సైజ్ గత సంవత్సరం 496 ఈ సంవత్సరం 613 కేసులు నమోదు. పిడిఎస్ రైస్ 2023-77,2024-217. గుట్కా కేసులు 08, ఇసుక 421-482, సైబర్ క్రైమ్ 2023-276,2024-135 నాలుగు కోట్ల 99 లక్షలు మోసానికి పాల్పడితే 85 లక్షల 90 వేల రూపాయలు రికవరీ. రోడ్డు ప్రమాదాలు 2023-813,2024-863 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 9,840. నల్గొండ జిల్లా పోలీసులు ఇంటర్ స్టేట్ పార్ది గ్యాంగ్ కు 31 వివిధ ప్రకార దొంగతనాలు చేయగా ఆరు నెలల్లో వీరిని పట్టుబడి చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల మోటార్ సైకిల్ వాహనాల దొంగల నుండి 67 వాహనాలు, 90 లక్షల నగదు రికవరీ. మెడికల్ హెల్త్ క్యాంప్ జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమ కోసం క్యాంపు నిర్వహించగా 1435 మంది వివిధ రకాల రక్త నమూనాలు చేయించగా దాదాపు 40 మందికి తీవ్రమైన రుగ్మతలు ఉన్నట్లు తేలగా వీరికి మెరుగైన వైద్య చికిత్స అందించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మా సాంఘిక కార్యకలాపాలు సాగకుండా యాంటీనార్కటిక్ డాక్ కార్యక్రమాలు 1728 వాహనాలు తనిఖీ. మొబైల్ పోగొట్టుకున్న వారికి ఇచ్చి ఐఆర్ యాప్ ద్వారా 3614 కంప్లైంట్ లగాను 1473 ఫోన్లను ట్రేస్ అవుట్ చేసి బాధ్యులకు అందించడం జరిగింది. ఎమర్జెన్సీ 100 డయల్ 51650 కేసులను నాలుగు నిమిషాల 4 సెకండ్లలో రెస్పాండ్ అవ్వడం జరిగింది. జిల్లా పోలీసు యంత్రాంగం సోషల్ మీడియా ఫేస్ బుక్ ల ద్వారా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ప్రతిరోజు పోస్ట్ చేయబడుతున్నాయి. ఆపరేషన్ స్మైలీలో, ముస్కాన్ లో భాగంగా 14 సంవత్సరాల పిల్లలను పని చేయించడం, స్వేచ్ఛకు భంగం కలిగించడం చట్టరిత్త నేరం ఆపరేషన్లు భాగంగా 102 కేసులు నమోదు 127 మంది పిల్లలను రక్షించారు.2024 సంవత్సరం నేర నియంత్రణకు సంబంధించి నివేదికను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తదితర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 18