రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనాలు.

రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనాలు..

– రాజీవ్ రహదారిపై వాహనదారులకు ఆంక్షలు

– తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ప్రయాణికులు.

పెద్దపల్లి జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి లో నిర్వహించిన యువ వికాసం విజయోత్సవ సభకు హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే మధ్యలో నుంచి వెళ్లిపోయిన జనాలు, దీంతో సభా ప్రాంగణం ఖాళీగా మారింది. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు పోలీసులు ఆంక్షలు విధించడంతో, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. యువ వికాసం పేరిట నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తామని పిలిచి నియామక పత్రాలు అందజేయకపోవడంతోపాటు, కనీసం సభా ప్రాంగణంలోకి అనుమతించలేదని, పిల్లలతో ఈ రాత్రి వేళలో సభా ప్రాంగణం బయట ఎదురుచూసేట్టుగా చేసి మమ్మల్ని అవమానించారని నిరుద్యోగులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ చెత్త బండ్లలో మజ్జిగ ప్యాకెట్లు,వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడంతో సభా ప్రాంగణానికి వచ్చిన కార్యకర్తలు యువకులు అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు తమ పేరు మార్పిడి కొరకై అవకాశాన్ని కల్పించాలని మంత్రులు ప్రసంగిస్తుండగానే ప్లకార్డులతో వ్యతిరేక నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment