చీరల గాజుల సంస్కృతి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో ప్రారంభం కావాలి

*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నుండి చీరలు గాజులు సంస్కృతి మొదలవ్వాలి*

*కరీంనగర్ జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ బండి మల్లేష్*

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*

కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నుండే చీరలు గాజులు సంస్కృతి మొదలవ్వాలని కరీంనగర్ జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు గాజులు చీరలు వేసుకోవాలన్న కౌశిక్ రెడ్డి మాటలపై బండి మల్లేష్ ఘాటుగా స్పందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో భార్యను కూతుర్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి శవ యాత్ర రాజకీయం చేసి శవాలపై పేలాలు ఏరుకున్నట్లు ఎన్నికల్లో గెలిపించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అని ఓట్లు అడుక్కున్నారని అలా గెలిచి కౌశిక్ రెడ్డి గెలుపే కాదని ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ నిబంధనల్ని తుంగలో తొక్కిన వ్యక్తి నీతులు చెపుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు గా ఉందని ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక హక్కు కౌశిక్ రెడ్డికి లేదని మల్లేష్ అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వం 38 మంది ఇతర ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల్లాగా కొన్నందుకు ముందు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కు గాజులు చీరలు సంస్కృతి హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని బండి మల్లేష్ డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now