తుంగతుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ vs మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఇరువర్గాల కార్యకర్తలు.. ఇద్దరికి గాయాలు
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు ముదురుతున్న వర్గపోరు
సూర్యాపేట – తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఇరువర్గాల మధ్య ఘర్షణ
జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గంట ముందు సభా స్థలానికి చేరుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు, ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటొ చిన్నగా ముద్రించారని ప్రొటోకాల్ పాటించడంలేదని ఘర్షణకు దిగడంతో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ ఇరువర్గాల మద్య తోపులాట
ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేయడంతో ఒకరికి కాలువిరిగి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు