హైదరాబాద్: ఆరాంఘర్- జూపార్కు పైవంతెనను ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో పైవంతెనను బల్దియా నిర్మించింది.
హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బంది పడటమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్యప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మకరహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పైవంతెనలు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరంచేస్తోంది. ఎస్‌ఆర్‌డీపీలోలో భాగంగా సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన