అత్తింటి వేధింపులు భరించలేని ఇల్లరికపు అల్లుడు ఆత్మహత్య
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా అక్టోబర్ 30
అత్తమామల వేధింపులు భరించలేక ఇల్లరికపు అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయి ఆలయ సమీపంలోని షెడ్డులో గురువారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా లోని పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన అన్వేష్ రెడ్డి (30) గత ఐదు సంవత్సరాల క్రితం మాచారెడ్డి మండలం , ఘనాపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి ఇల్లరికం అల్లుడిగా వెళ్ళాడు. గురువారం ఉదయం ఉగ్రవాయి కట్ట మైసమ్మ ఆలయం వద్ద షెడ్డులో అన్వేష్ రెడ్డి తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే మృతుని సూసైడ్ నోట్ లభించింది. మృతుని సూసైడ్ నోట్ లో తన అత్తమామలు వేధిస్తున్నారని ఆ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.