ప్రపంచ కార్మిక శక్తిని ఏకం చేసిన రోజు మే డే

*ప్రపంచ కార్మిక శక్తిని ఏకం చేసిన రోజు మే డే*

*ఘనంగా మేడే వేడుకలు*

*జమ్మికుంట మే 1 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మేడే వేడుకల కార్మిక సంఘ నాయకులు కార్మికులు ఘనంగా నిర్వహించారు మేడే పురస్కరించుకొని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కార్మిక భవనం వరకు భారీ ర్యాలి నిర్వహించారు జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ పింగిలి రమేష్ నాయకులు పాల్గోని కార్మిక సంఘం జెండా ఎర్ర జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక శక్తిని ఏకం చేసిన రోజు శ్రమ దోపిడి బానిస బతుకులకు స్వస్తి చెప్పిన రోజు కార్మిక హక్కుల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యోధులను స్మరించుకుంటూ మే 1 న ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడే వేడుకలు జరుపుకుంటామని చెప్పారు.కార్మిక హక్కుల సాధన సాకారం చేసిన రోజున మేడే జరుపుకుంటారని తెలిపారు కరోనా లాంటి విపత్కర కష్టకాలంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు ఎనలేని సేవలందించారని తెలిపారు అసంఘటిత కార్మికులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల కొరకు నిరంతరం కృషి చేయాలని 24 గంటల పని దినాన్ని కుదించి, ఎనిమిది గంటలకే పరిమితం చేసిన ఘనత కార్మికుల ఐక్యత వలన సాధ్యమైందని స్పష్టం చేశారు. నేటి పాలక వర్గాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీనిని తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు పరిచి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి యాజమాన్యాలకు కొమ్ముకాయాలని ప్రయత్నిస్తుందని, దీనిని కార్మిక కర్షకులంతా వ్యతిరేకించాలని వారు కోరారు.కార్మిక సంఘాల నాయకులు, హమాలీ, దాడువాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now