100 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యం..

కాలువలో పడి గల్లంతైన చిన్నారి మృతి

100 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యం

గుండెలవిసేలా రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు.

పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రి కి తరలింపు

 

IMG 20240822 WA0030

ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయి న చిన్నారి మృతదేహం లభించింది. మా పాపకు ఎలాంటి హాని జరగదు.. పాపకు ఏమీ కాదు అంటూ.. ఎంతో ఆశతో ఎదురుచూసిన ఆ చిన్నారి తల్లిదం డ్రుల ను శోకసముద్రంలో ముంచింది. చిన్నారి మృతదేహాన్ని ఒక్కసారిగా చూసిన తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. రోజువారి పనుల్లో భాగంగా బుధవారం ఉదయం తల్లిదండ్రులు ఆ చిన్నారికి బాయ్ బాయ్ అంటూ వెళ్లిన వారికి అదే చివరి చూపుగా మిగిలిందంటూ వారి రోధన వర్ణాతీతం. నిజాంబాద్ నగరంలోని ఆనంద్ నగర్ లో బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల అనన్య (అను) పడి గల్లంతైన విషయం విధితమే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ,రెవెన్యూ ,పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా బుధవారం అర్ధరాత్రి వరకు గాలింపు చేశారు. చీకటి కావడంతో గురువారం ఉదయం ప్రత్యేక బృందం మురుగు కాలు వ లో గాలిస్తుండగా చిన్నారి కాలువలో పడిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో చిన్నారి మృతదేహం లభమైంది. రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నారి మృతితో ఆనంద్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతదేయాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now