మృతి చెందిన ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

 

IMG 20250703 194002
*ఎస్ఐ రాజేశ్వర్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్*

*అంత్యక్రియాలకు హాజరైన జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ బోనాల బందోబస్తును ముగించుకొని తన కారులో ఇంటికి సంగారెడ్డి వస్తుండగా మార్గమద్యలో సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల చర్యాల ఎక్స్-రోడ్డు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు గురయ్యాడు. వెంటనే చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ.. ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ 1990లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా నియామకమై, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో సాధారణ విధులతో పాటు స్టేషన్ రైటర్ గా విధులను నిర్వహించారని అన్నారు. అనంతరం జిల్లా టెక్నికల్/కంప్యూటర్ విభాగంలో సుమారు 15 సంవత్సరాలుగా ఐటీ సెల్ ఇంచార్జ్ గా విధులను నిర్వహించారని చెప్పారు. ఆయనకు భార్య గాయత్రి, ఇద్దరు పిల్లల సంతానం ఉన్నారని అన్నారు. ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ జిల్లా పోలీసు శాఖలో అందించిన సేలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు జిల్లా పోలీసు శాఖ ఎల్ల వేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఆర్.ఐ రామరావు, ఆర్మూడ్ సిబ్బంది, ఐ.టి సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now