రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకటేష్ మృతి చెందడం బాధాకరం
రోడ్డు ప్రమాదంలో యువకులైన ఇద్దరి కానిస్టేబుల్ కోల్పోవడం డిపార్ట్మెంట్ కు తీరని లోటు
సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ
గజ్వేల్ డిసెంబర్ 8 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు సమీపంలో అకారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన పరంధాములు, వెంకటేష్, కానిస్టేబుల్ లను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి లో ఉన్న మృతదేహాలను సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
*మృతి చెందిన కానిస్టేబుల్ ల వివరాలు*
వర్కల్ పరంధాములు, పోలీస్ కానిస్టేబుల్, వయస్సు 46 సంవత్సరాలు, పోలీస్ స్టేషన్ రాయపోల్, నివాసం పెద్ద కోడూరు, మండలం చిన్నకోడూర్ పూసల వెంకటేష్, పోలీస్ కానిస్టేబుల్, వయస్సు 38 సంవత్సరాలు, పోలీస్ స్టేషన్ దౌల్తాబాద్, నివాసం గాడి చర్లపల్లి, సిద్దిపేట పట్టణం. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయమున ఇరువురు కానిస్టేబుల్ మోటార్ సైకిల్ నెంబర్ AP15BN-9215 గల దానిపై హైదరాబాదులోని ఈసీఐఎల్ లో రన్ జాతరకు పాల్గొనడానికి వెళ్లుచుండగా గజ్వేల్ గ్రామ శివారు పాండవుల చెరువు సమీపంలో ఏదో గుర్తు తెలియని వాహనం అతివేగంగా జాగ్రత్తగా వచ్చి టక్కరి ఇవ్వగా ఇరువురి కానిస్టేబుల్ కు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినారు. పోలీస్ కమిషనర్ బి అనురాధ, అడిషనల్ డీసీపీ యస్, మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు గజ్వేల్ ఇంచార్జ్, ఇన్స్పెక్టర్ సైదా, దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పరంధాములు వెంకటేష్ ఇరువురు ఇరువురి కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులను పరామర్శించి రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించినందుకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి డిపార్ట్మెంట్ తరఫున రావలసిన అన్ని బెనిఫిట్స్ త్వరలోనే కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ బి అనురాధ ఆదేశానుసారం గజ్వేల్ ఇంచార్జ్ ఏసిపి మధు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, గజ్వేల్ మార్చరి రూమ్ వద్ద ఇరువురి మృతదేహాలపై
పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు సందర్భంగావారి బంధువులను పరామర్శించారు.డిపార్ట్మెంట్ తరఫున అండగా ఉంటామని తెలిపారు.అంత్యక్రియల గురించి ప్రభుత్వం తరఫున ఇరువురికి కలసి ₹ 60 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పరంధాములు స్వస్థలం పెద్దకోడూర్, వెంకటేష్ స్వస్థలం గాడి చర్లపల్లి సిద్దిపేట ఏసిపి మధు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, దౌల్తాబాద్ రాయపోల్ పోలీస్ సిబ్బంది బ్యాచ్ మెంట్ మిత్రులు ఇరు గ్రామాల ప్రజా ప్రతినిధులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు మృతదేహంపై పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు.