Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి బాధాకరం

IMG 20241208 WA0791

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి భాదాకరం

చెరుకు శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట డిసెంబర్ 08 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే.దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని రాయపోల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే పరందాములు, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేసే వెంకటేశ్ మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు.హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందారు.ఈ ప్రమాదంపై దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.కానిస్టేబుళ్ల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కానిస్టేబుళ్ల కుటుంబాలకు అండగాఉంటామని హామీ ఇచ్చారు.

Exit mobile version