Site icon PRASHNA AYUDHAM

బాసరలో భక్తుల మృతి దురదృష్టకరం.. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

IMG 20250615 WA0167
    1. బాసరలో భక్తుల మృతి దురదృష్టకరం: జిల్లా కలెక్టర్ అభిలాష

 

బాసర గోదావరి నదిలో యాత్రికుల మృతి పై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్‌కి చెందిన భక్తులు బాసర దేవస్థాన దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు.

గతంలోనే నది సమీపంలో మెట్లు ఏర్పాటుచేసిన ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో స్నానాలు నిషేధించామని పేర్కొన్నారు. భద్రతా పరంగా ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బైంసా ఆర్డీవోతో మాట్లాడినట్లు తెలిపారు. ఘటనపై సమీక్షించి, సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. భక్తుల భద్రతకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Exit mobile version