Site icon PRASHNA AYUDHAM

మృత్యువు ఇలా కూడా…??!!

IMG 20250502 WA2575

*మృత్యువు ఇలా కూడా…??!!*

తుంగతుర్తి మండలం ఏనేకుంటతండా గ్రామానికి చెందిన *మృతుడు బానోతు రమేష్ (33)* తన టీవీఎస్ ఎక్సెల్ 100 ద్విచక్రవాహనంపై నిన్న సాయంత్రం అతని భార్యను, కూతురును ఎక్కించుకుని కిరాణసామాన్ల కోసం పెద్దముప్పారం గ్రామానికి వచ్చాడు. మరికాసేపట్లో తాను వెళ్లాలనుకునే సరుకులదుకాణం వస్తుందనగా పెద్దముప్పారం గ్రామంలోని అలువాల రాములు ఇంటి ముందుకు చేరుకోగానే మృతుడు బానోత్ రమేష్ బైకు ముందు వెల్తున్న, అదే గ్రామానికి చెందిన *పెండ్లి దామోదర్ రెడ్డి* అనే అతడు తన స్కూటీ ద్విచక్రవాహనంపై ఫామ్ ఆయిల్ చెట్ల గెలలను కోయుటకు ఉపయోగించే రెండు కత్తులను బండికి కట్టుకొని వెల్తున్నాడు. దామోదర్ రెడ్డి ఒక్కసారిగా తన స్కూటికి సడన్ బ్రేక్ వేయగా బండికి కట్టి ఉన్న కత్తులు వెనుకే వస్తున్న మృతుని గొంతులోకి దిగి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ..హటాత్పరిణామంలో రమేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బానోత్ సునీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దంతాలపల్లి *ఎస్ఐ పి రాజు* తెలిపారు.

Exit mobile version