యువకుల మరణం చాలా బాధాకరం

  • కొండపోచమ్మ సాగర్ వద్ద యువకుల మరణం చాలా బాధాకరం
  • ప్రభుత్వం వీరి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.
  • ఎంపి రఘునందన్ రావు.

దుబ్బాక ప్రతినిధి, 11 జనవరి 2025 : గజ్వేల్ నియోజకవర్గం కొండ పోచమ్మ సాగర్ వద్ద యువకుల మరణం చాలా బాధాకరం అని శనివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు.విషాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వీరి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకో వాలని రఘునందన్ రావు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, కొండ పోచమ్మ సాగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు భద్రతా, చర్యలు కట్టుదిట్టం చేయాలని అధికారులని ఆదేశించారు.

Join WhatsApp

Join Now