ఐదుకు చేరిన మృతుల సంఖ్య

*ఐదుకు చేరిన మృతుల సంఖ్య*

హైదరాబాద్:మార్చి 02

ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. గంట క్రితమే మరొక కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీయడంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది.

ఇంకా మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండో టిబెటన్ బార్డర్‌లో పనిచేస్తోన్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది కంటైనర్లలో బసచేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.

50 మందికిపైనే కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ బృందాలు అతి కష్టం మీద కాపాడి వెలికి తీసుకొచ్చాయి.

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రెస్క్యూ ఆప రేషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. డియన్ ఆర్మీ, ఇండోటి బెటన్ బార్డర్ పోలీసు ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ రెస్క్యూ ఆపరే షన్ లో పాల్గొంటున్నాయి.

Join WhatsApp

Join Now