మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు*.
రైతు భరోసా కింద రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 12 వేల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం.. హర్షణీయం .
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటు ఎకరాకు 10 వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల భరోసా ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో పాటు మంత్రులకు ధన్యవాదాలు..
ఇంతటి ఆర్థిక నిర్బంధం, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం…
రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి, ఆర్థిక విద్వంసం చేసింది..
అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అడ్డగోలు వ్యవహారాలు, కనిషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన పనులు చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయింది..
రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడ వెనకడకుండా ప్రజలకు మేలు చేస్తున్నాం..
22 వేల కోట్లతో రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేసాము.. ధాన్యం కొనుగోలు కు క్వింటాలు కు 500 రూపాయల బోనస్ ఇచ్చాం.
గత ఏడాది రైతు భరోసా ఇచ్చాము.. ఈ ఏడాది జనవరి 26 నుంచి 12 వేల రూపాయలు ఎకరాకు భరోసా పెంచి ఇస్తున్నాం.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు, కౌలు రైతులకు 12 వేల రూపాయలు ఇస్తున్నాం.
ఇలాంటి గొప్ప పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రతిపక్ష బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ లు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మంచి పనులు చేసిన కూడా భరించలేకపోతున్నాయి…
జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసా కార్యక్రమాలపై ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవాలి..