జలశక్తి అభియాన్ క్రింద చేపడుతున్న పలు కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర పవర్ మినిస్ట్రీ డిప్యూటీ సెక్రటరీ

జలాశక్తి అభియాన్ క్రింద చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన..

 

-కేంద్ర పవర్ మినిస్ట్రీ డిప్యూటీ సెక్రటరీ బెంజమెన్ కరుణాకరన్ 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 08:

 

జిల్లాలో జలాశక్తి అభియాన్ క్రింద చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి కేంద్ర పవర్ మినిస్ట్రీ డిప్యూటీ సెక్రటరీ బెంజమెన్ కరుణాకరన్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో జలశక్తి కార్యక్రమం క్రింద వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు వివరించారు. గ్రామీణాభివృద్ధి, గ్రౌండ్ వాటర్, అటవీ, నీటి పారుదల, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖాధికారులు వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త ఆచార్య శ్రీకృష్ణ పవార్, అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అటవీ అధికారిని నిఖిత, జడ్పీ సిఈఒ చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారిని జ్యోతి, గ్రౌండ్ వాటర్ అధికారి సతీష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now