అణగారిన వర్గాల అభివృద్ధి భాగ్యరెడ్డి వర్మ సంకల్పం
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా భాగ్యరెడ్డి వర్మ సంకల్పం ఉండేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయావరణంలో కామారెడ్డి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జన్మదినం సందర్భంగా పుష్పాలంకరణ తో కలెక్టరేట్ లో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రసంగిస్తూ భాగ్యరెడ్డి వర్మ జీవిత విషయాలను తెలుపుతూ వారు చేసిన సామాజిక కార్యక్రమాలను, ఆదిహిందూ ఉద్యమాన్ని ప్రారంభించి అణగారిన వర్గాల హక్కులు, గుర్తింపుల కోసం పోరాటం సాగించారనీ, గాంధీ తో కూడా సన్నిహిత సంబందాలు కలిగి వున్నారు అని , నిజాం ప్రభుత్వం లో ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ సి డి ఓ రజిత, ఎస్సి కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఇతర జిల్లా అధికారులు , జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, సహాయ సంక్షేమ అధికారులు , వసతి సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.