Site icon PRASHNA AYUDHAM

నల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20250820 184947

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ డివిజన్ సిర్కాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నీటి నిలువ సామర్థ్యం, ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు వివరాలు నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రాజెక్టు ద్వారా కుడి కాలువ కింద 4080, ఎడమకాల ద్వారా ఎడమకాల ద్వారా 1980 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ప్రాజెక్టు కుడి కాలువ, ఎడమ కాలువలలో జరుగుతున్న పూడికతీత చెట్ల తొలగింపు పనులకు జెసిబిలను ఉపయోగించి త్వరగా పూర్తీ అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.చెరువులు నిండిన పరిస్థితుల్లో ప్రజలు చెరువుల వద్దకు వెళ్లకుండా, ముఖ్యంగా చెరువు కట్ట దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.త్వరలో మండలంలోని అప్రోచ్ రోడ్లో నిర్మాణం, మరమ్మత్తు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎఫ్ డీఆర్ నిధులతో మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్అండ్ బి శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సిర్గాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకట సాయి ఫర్టిలైజర్స్ దుకాణంలో ఎరువుల విక్రయాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని, యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని అన్నారు. జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ టీం ద్వారా యూరియా అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. యూరియా విక్రయ దుకాణదారులు తమ దుకాణంలో యూరియా నిల్వలు, ధరల పట్టికను ప్రదర్శించాలని, వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సంబంధిత వివరాలతో ప్రతిరోజు నివేదిక అందించాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఈపాస్ యంత్రాలను ఉపయోగించి బయోమెట్రిక్ తీసుకొని రైతులకు యూరియా ఇతర ఎరువులు సరఫరా చేయాలని ఈ సందర్భంగా యజమాని కి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 *నల్ల వాగు రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్* 

సిర్గాపూర్ మండల పరిధిలో భాగంగా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలు నల్లవాగు లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో శానిటేషన్ పరిస్థితి పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి మెరుగు పరచాలని పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం నాణ్యమైన విద్యను రెసిడెన్షియల్ పాఠశాలలో అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో డైనింగ్ హాలు కిచెన్ షెడ్డు స్టోర్ రూమ్ లోని తరగతి గదులను పరిశీలించారు.శానిటేషన్ సమస్య వల్ల అనేక రకాల సమస్యలు అవకాశం ఉన్నందున శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితిని మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. అంటువ్యాధులు విష జ్వరాలు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ముందుగా సానిటేషన్ సమస్యను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఇరిగేషన్ డివిజన్ ఈఈ సుందర్, డిఈ పవన్ కుమార్, సిర్గాపూర్ తహసిల్దార్ హేమంత్ కుమార్, రెవెన్యూ శాఖ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version