Site icon PRASHNA AYUDHAM

గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరణ

IMG 20250915 WA0211

గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరణ

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 15

 

తెలంగాణ విమోచన దినోత్సవానికి భాజపా రంగం సిద్ధమైంది. తాడ్వాయి మండల భాజపా కార్యాలయంలో శనివారం మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, రాష్ట్ర ఆర్టీకల్చర్ కన్వీనర్ గంగారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రలో అత్యంత ప్రాధాన్యతగల రోజు అని, ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందిన రోజే అని పేర్కొన్నారు.

 

మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, OBC మోర్చా అధ్యక్షుడు దత్తాత్రేయ, యువ మోర్చా అధ్యక్షుడు రాజిరెడ్డి, IT సెల్ అధ్యక్షుడు ముదాం మహేష్, బూత్ అధ్యక్షుడు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

కార్యక్రమం ముగింపు సందర్భంగా కార్యకర్తలు “భారత్ మాతాకీ జై” నినాదాలతో కార్యాలయం మార్మోగించారు.

Exit mobile version