ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14 దమ్మపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, నాచారం ధాన్యం కొనుగోలు కేంద్రం , దమ్మపేట ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీలు చేసి సెంటరు ఇంచార్జి లకు, రైతు యార్డ్ వద్దకు వచ్చిన దగ్గర నుండి వారి ధాన్యం యొక్క తేమ శాతం రిజిష్టర్ లో నమోదు చేసుకొవాలని మరియు సెంటర్ లో ఎన్ని వరి కుప్పలు ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి అనే సమాచారం ఎప్పటికప్పుడు రిజిస్టర్లో అప్డేట్ చేసుకోవాలని అధికారుల తెలియజేశారు.
రైతులు తప్పకుండా తేమ శాతం వచ్చిన తరువాత తూర్పార పట్టిన తరువాత మాత్రమే కాటాలు వేయాలని సెంటరు ఇంచార్జి లకు సూచించారు. అదేవిధంగా రైతులు గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ప్రకటించింది కాబట్టి దళారీలను నమ్ముకోకుండా సెంటర్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు యాడ్లోనే ధాన్యం అమ్ముకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఏ ఈ ఓ దీప్తి , వినోద్ , జిసిసి మేనేజర్ , సెంటర్ ఇన్చార్జులు మరియు రైతులు పాల్గొన్నారు.
దమ్మపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి
by Naddi Sai
Updated On: November 14, 2024 6:14 pm