ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్..
ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఇంచార్జ్ రెవిన్యూ డివిజనల్ అధికారి బి. వినూత్న, ఐ.ఏ.యస్. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని స్థానిక కళ్యాణదుర్గం పట్టణం నందు గల ప్రభుత్వ ఆసుపత్రి ని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఇంచార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి, కళ్యాణదుర్గం వారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ లో భాగంగా ఆసుపత్రి లోని అన్ని గదులను, రిజిస్టర్ లను, ఆసుపత్రి పరిసరాలను పరిశీంచారు. రోగులతో మాట్లాడుతూ. వసతులు, వైద్య సదుపాయం, డాక్టర్ల పని వేళలు మొదలైన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఆసుపత్రి సిబ్బంది తో మాట్లాడుతూ. రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సరైన వైద్య సదుపాయలను అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకొనవలసి ఉంటుందని తెలియజేసరు.
ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్..
by kana bai
Updated On: October 23, 2024 11:06 am