జడ్పీహెచ్ఎస్ పాఠశాలఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆశిష్ సంగ్వాన్
డిసెంబర్ 20.:ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ఈ విద్యా సంవత్సరంలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారి లో నర్సరీ లను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్ లోని కిచెన్ లో వంటలను, స్టోర్ రూమ్ లోని బియ్యం లను పరిశీలించారు.
ఆరోగ్య ఉప కేంద్రం ను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, గర్భిణీలకు నెలవారీ పరీక్షలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్ లను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్రన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, ప్రతీ సమాచారం యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలను, కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న ఆట పాటల్ని ,అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో పాటలు పాడించారు.
ఎత్తుకొని అక్కడ ఏర్పాటుచేసిన బొమ్మలను ఏమంటారు అని పిల్లలని కలెక్టర్ అడిగారు. అనంతరం గాంధారి నర్సరీ ను సందర్శించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయని, నీటిని రెండు మూడు రోజులు పట్టాక విత్తనాలు విత్తడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈ సారి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా విద్య శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఇన్చార్జి తహసీల్దార్ రవికాంత్, ఎంపీడీఓ సతీష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.