ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 11:
ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 44 ముష్రంభాగ్ ( స్టేషన్ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లను ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి మేరకు మొత్తం సమాచారాన్ని ఆయా కుటుంబాల్లోని ప్రతీ వ్యక్తి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఎన్యుమరేటర్ లు పక్కగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులులేకుండా సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ప్రతీ ఎన్యూమరేటర్ రోజుకు 15 నుండి 20 ఇళ్లల్లో సమాచారాన్ని సేకరించి విధంగా వేగవంతంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్ లు ఎన్యుమరేటర్ లకు తగు సలహాలు, సూచనలు, సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్ధన్, ఇన్చార్జి మున్సిపల్ కమీషనర్ వేణు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్..
by kana bai
Updated On: November 11, 2024 10:18 pm