Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్..

GridArt 20241021 155128550

ప్రజావాణిలో ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:

ప్రజావాణి కి వచ్చే దరఖాస్తు దారుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు అర్జీ దారుని సమస్యను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు (56) పలు సమస్యలపై దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రజావాణి లో జడ్పీ సి.ఈ.ఒ. చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version