సిపిఎం జిల్లా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాల గురించి వివరించిన జిల్లా కార్యదర్శి

సిపిఎం జిల్లా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాల గురించి వివరించిన జిల్లా కార్యదర్శి

– రాష్ట్ర మహాసభల వేదిక పై మాట్లాడుతున్న కామారెడ్డి జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్

– కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిపిఎం మహాసభలు సంగారెడ్డి లో మూడవ రోజు జరుగుతున్న సభలో కామారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాల గురించి ప్రతినిధుల అభిప్రాయాన్ని మహాసభకు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వివరించరు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో గతం కంటే ప్రజాసంఘాల ఉద్యమంపెరిగిందని, జిల్లాలో పోడు భూములు ఇండ్ల స్థలాలు పోరాటాలు ప్రజా సంఘం ఆధ్వర్యంలో విజయాలు సాధించమన్నారు. కామారెడ్డి జిల్లాలో బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని, కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాలఆసైండ్ భూమి అన్యాక్రాంతమైందని ఇంకా జిల్లాలో రైతులు, కార్మికులు, కర్షకుల సమస్యలపై ప్రధానంగా జిల్లాలో బీడీ పరిశ్రమలో దోపిడీ చేస్తున్న బీడీ కంపెనీ ఈ దేశాయితో పాటు అన్ని కంపెనీల పై రాజిలేని పోరాటాలను రూపకల్పన చేసుకుంటామన్నారు. ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now