*డ్రైవర్ అజాగ్రత్త ట్రావెలింగ్ బస్సు బండ రాళ్లకు ఢీ*
*ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు*
,మిర్యాలగూడ డిసెంబర్ 20:
శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాల సమయంలో మిర్యాలగూడ బై పాస్ రోడ్ లో శరణ్య గ్రీన్ హోమ్ సమీపంలో కందుకూరు నుండి హైదరాబాద్ కి వెళ్ళుచున్న ప్రయివేట్ బస్ వేమూరి- కావేరి ట్రావెల్ బస్సు సుమారు 33 మంది ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్ యొక్క బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటం వలన బైపాస్ రోడ్ పక్కన గల కాలువ లోకి దూసుకెళ్లి ఒక బండ రాయికి డీ కొట్టడం వలన బస్సు లోని 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.గాయపడిన వారిలో ఇద్దరికీ తలకు తీవ్రగాయాలు కాగా,మిగిలిన 8 గురికీ సాధారణ గాయాలతో ప్రాణాల నుండి బయటపడ్డారు. గాయపడిన వారు హైదరాబాద్ లోని హాస్పిటల్స్ నందు ట్రీట్మెంట్ నడుస్తుంది.నిర్లక్ష్యంగా నడిపిన బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి.నాగర్జున వివరాలు తెలిపారు.