*చెత్త డంపింగ్ ను ఎత్తివేయాలి*
*నివాసయోగ్యంగా కనీస సౌకర్యాలు కల్పించాలి*
*లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి*
*సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకుంటే ఇండ్ల ముందు మున్సిపాలిటీ సిబ్బంది చెత్త డంపింగ్ చేస్తున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం రోజున జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు తాసిల్దార్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని అర్హులైన వారికి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 2006-07 సంవత్సరంలో నాటి,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 275 ,278లో సుమారు 370 మంది పేదలకు నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేశారన్నారు పట్టాలు పంపిణీ చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు 2009 సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మెటీరియల్ డబ్బులు రావడంతో చాలామంది ఇండ్లు నిర్మించుకున్నారని అన్నారు స్థలాలు కేటాయించారే తప్ప కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కొన్ని సంవత్సరాలు పాటు అనేక వ్యాయ ప్రయాసాల కోర్చి నివాసం ఉన్నారని, కొంతమంది ఆకతాయిలు బెదిరింపులకు పాల్గొనడంతో ఇల్లు విడిచి పట్టణంలో అద్దె ఇండ్లలో ఉంటున్నారని తాగునీరు విద్యుత్ సౌకర్యం రహదారుల నిర్మాణం లేకపోవడంతో లబ్ధిదారులు సంవత్సరాలపాటు తమ ఇబ్బందులను అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ స్పందించలేదన్నారు అదే పేదలకు ఇచ్చిన స్థలంలో మున్సిపాలిటీకి 2001 సంవత్సరంలో డి ఆర్ సి సి, ఎఫ్ ఎస్ టి పి కి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి ఎమ్మార్వో పేదలకు కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులే ఇలా చేయడం దుర్మార్గమన్నారు
370 మంది లబ్ధిదారులకు 80 గజాల చొప్పున నాటి నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించి నివేశస్థలాలు కేటాయించిందని వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీదేనన్నారు సంవత్సరాల తరబడి లబ్ధిదారులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మార్వో మొదలుకొని, కలెక్టర్, మంత్రుల చుట్టూ పలుమార్లు తిరిగి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోగా కేటాయించిన స్థలంలో చెత్త డంపింగ్ చేయడం సరికాదన్నారు వెంటనే చెత్త డంపింగ్ ని ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు నిధులు మంజూరు చేసి కేటాయించిన స్థలంలోనే ఇండ్లు కట్టించి ఇవ్వాలని నివాస యోగ్యంగా ఉండేందుకు త్రాగునీటి సౌకర్యం కరెంటు సౌకర్యం రహదారులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు మున్సిపాలిటీ సిబ్బంది తాము కట్టుకున్న ఇళ్ల ముందు చెత్త కుప్పలు పోయడంతో దుర్గంధం వస్తుందని, రోగాల బారిన పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వానికైనా పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటుందని నోటికి వచ్చిన ముద్దను తిరిగి లాక్కోనే ప్రయత్నాలు మానుకోవాలని, 370 మందిలో అందరూ కూడా కూలి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారేనని, అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుపేదలే లబ్ధిదారులుగా ఉన్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెత్త డంపును ఎత్తివేయాలని వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు లేనియెడల బాధితుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం బాధితులకు వెన్నంటే ఉంటుందన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ నాయకులు కొప్పుల శంకర్ చెలుపూరి రాములు లబ్ధిదారులు నాగిశెట్టి వెంకటేశ్వర్లు పిక్కల కమల దామెర సంతోష్ సత్తి సమ్మయ్య గొర్రె స్వరూప మాదాసు రవీందర్ సరిత, రాజ్యలక్ష్మి పద్మ కొడారి రాజుతో పాటు 100మందికి పైగా లబ్ధిదారులు పాల్గొన్నారు.