కాంగ్రెస్ నేతలను భయాందోళనలకు గురి చేయటానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొంగులేటి శ్రీనన్న పై ఈ డి దాడులు – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజామోద కార్యక్రమాలను చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రెవిన్యూ శాఖా, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయిస్తున్నదని డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పొంగులేటి పై ఈ డి దాడులను నిరసిస్తూ శనివారం పాల్వంచలోని పొంగులేటి శ్రీనన్నక్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముక్త కంఠంతో శ్రీనన్న పై దాడులను ఖండించారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల ముఖ్యనాయకులపై దాడులు చేయించి, లొంగదీసుకోవాలని ప్రయత్నించడం పరిపాటి అయిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పొంగులేటి పై దాడులు చేయించి, ఏమి చేయలేక భంగపడ్డారన్నారు. దేశంలో నానాటికీ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సందర్బంలో ప్రతిపక్షాల ముఖ్య నాయకులపై ఈ డి , ఐటీ దాడులను చేయిస్తుందన్నారు. దాడులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలె జానకిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, లేబర్ సెల్ అధ్యక్షులు సాదం రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, కాపర్తి వెంకటాచారి, దొప్పలపూడి సురేష్, వై. వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, నల్లమల్ల సత్యం, చాంద్ పాషా, పి. నరహరి, కాపా శ్రీను, వాసుమల్ల సుందర్ రావు, పాబోలు నాగేశ్వరరావు, చింతా నాగరాజు, పులి సత్యనారాయణ, చౌగాని పాపారావు, పైడిపల్లి మహేష్, సూర్యకిరణ్, ధారసోత్ ఉపేందర్, బాషా, వై. మల్లికార్జున్, బానోత్ బాలాజీ నాయక్, జీవన్ రెడ్డి, గంధం నరసింహరావు, అజ్మీరా రమేష్, భూక్యా ప్రసాద్, సామా వెంకటరెడ్డి, పెంట్ల రాంరెడ్డి, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, శిరసాని రమణ, పుట్టి వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.