సంగారెడ్డి, ఆగస్టు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలోని పోతులగూడ గ్రామంలో గ్రామ రైతులు సంప్రదాయ పద్ధతిలో ఎడ్ల పండుగను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య సందర్భంగా పశువులకు పూజలు చేయడం, అలంకరించి ఊరేగింపు చేయడం గ్రామస్తులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రామ రైతులు తమ ఎడ్లను శుభ్రపరచి, రంగులు పూసి, పూలమాలతో ముస్తాబు చేశారు. ఆ తర్వాత ఎడ్లను ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
వట్ పల్లి మండలంలో ఘనంగా ఎడ్ల పండుగ
Oplus_131072