శివ్వంపేటలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు విద్యుత్ అధికారులు సహకరించడం లేదు.

గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి ఆవేదన..

స్ట్రీట్ లైట్లు వేద్దామంటే ఎల్సీ ఇవ్వడం లేదని ఆరోపణ..

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 1(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మండల కేంద్రమైన శివ్వంపేట వీధులలో రాత్రి వేళలో చీకటి లేకుండా వెలుగులు నింపడం కోసం కాలనిలలోని విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయిద్దామనుకొంటే మండల విద్యుత్ అధికారులు సహకరించడం లేదని శివ్వంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి. ఒక ప్రకటనలో తెలిపింది. కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో కొన్ని విధి లో విధి లైట్లు ఏర్పాటు చేయడం కోసం, మరికొన్ని చోట్ల వెలగని లైట్లను సరి చేయడమో. కొత్తరి మార్చడమో చేయడం కోసం గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్ సిబ్బంది కరెంట్ సంబలు ఎక్కడం కోసం విద్యుత్ సరఫరా నిలిపి వేయుల కోసం ఎల్ సి  కొరకు విద్యుత్ అధికారులను కోరగా ఎల్సీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆమె ప్రకటనలో తెలిపారు. కరెంట్ సరఫరా నిలిపి వేసేందుకు ఎల్సీ ఇవ్వక పోవడమే కాకుండా మీరు దగ్గరలోని విద్యత్ ట్రాన్స్ఫారం నుండి సరఫరా నిలపుదల చేసుకొండని నిర్లక్ష్యపు సమాధానం చెవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీ తీసుకుని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తేనే  కానీ ఎన్సీ లేకుండా చేస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది రక్షణ లేక ప్రమాదంగా ఉంటుందని ఆమె అన్నారు. విద్యుత్ అధికారులు సహకరించపోవడం వల్లనే గ్రామంలో అవసరమున్న చోట విధి దీపాలను ఏర్పాటు చేయలేకపోతున్నమని. విషయాన్నీ గ్రామస్తులు. గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now