ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ పనులకు శంకుస్థాపన

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ పనులకు శంకుస్థాపన

IMG 20250204 WA0056

ఆయుధం ఫిబ్రవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పి ఎ సి చైర్మన్ ఆరెక పూడి గాంధీ.

ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నవి అని, ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, గుర్రపు డెక్క తొలగింపు పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని,త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలని, గుర్రపు డెక్క తొలగింపు ద్వారా దోమల బెడద తగ్గునని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేసారు. గుర్రపు డెక్క మళ్ళీ రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గుర్రపు డెక్క తొలగింపు ద్వారా చెరువు కలుషితం కాకుండా, దోమల నిల్వ లేకుండా ఉంటుంది అని, అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలిపారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు .

Join WhatsApp

Join Now

Leave a Comment