*చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చెపట్టాలి*
జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి-టీఎస్ జేయు డిమాండ్
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన టీఎస్ జేయు బృందం
జర్నలిస్ట్ పెన్షన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
*హైదరాబాద్, (నిర్మల్) డిసెంబర్ 12:-* ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పాత్రికేయుల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లుగా జర్నలిస్టు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని టీఎస్జేయు రాష్ట్ర కమిటీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. అలాగే 10 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలని టీఎస్ జేయు నాయకత్వం మంత్రిని కోరింది. అక్రిడేషన్ల కమిటీలు పునరుద్ధరణ చేసి జర్నలిస్ట్ లందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనికోరారు. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్ట్ సంక్షేమ పథకాలను జర్నలిస్టుల అందరికీ అందేలా చూడాలని కమిటీ కోరింది. రాబోయే అక్రిడేషన్ కమిటీలలో అన్ని జర్నలిస్టు సంఘాలకు భాగస్వామ్యం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజ్ పటేల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు క్రాంతి కుమార్ అశోక్ తదితరులు ఉన్నారు.
ప్రధాన డిమాండ్లు:
1.చిన్న పత్రికలను తక్షణమే ఎమ్పానెల్‌మెంట్‌లో చేయాలి.
2.సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలి. 3.మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి, జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలి. 4.మీడియా ఉద్యోగుల సంక్షేమం జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలి.