Site icon PRASHNA AYUDHAM

ఆమె భర్త నే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన..!

IMG 20250517 WA0116

*హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఓ.. వ్యాపారవేత్త బార్యతో డ్రైవర్ వివాహేతరసంబంధం పెట్టుకుని, ఆమె భర్త నే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన* వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ కి చెందిన ఓ వ్యాపారవేత్త భార్యతో *డ్రైవర్ ఇఫ్తికార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.* సదరు వ్యాపారవేత్త దగ్గర *చాలాకాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్న ఇఫ్తికార్ అతని భార్యను వలలో వేసుకున్నాడు.*

*ఇద్దరు ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకున్న ఇఫ్తికార్ భర్తను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు.*

*తనకు రూ. కోటి ఇవ్వకుంటే ఆ వీడియోలు పోర్న్ సైట్ లో పెడతానని..మీ భార్యకు విడాకులు ఇవ్వకుంటే వీడియోలు అప్లోడ్ చేస్తాను లేదా కోటి రూపాయలు ఇవ్వండి అంటూ వాట్సాప్ మెసేజ్ ల ద్వారా బెదిరించేవాడని* తెలిపారు వ్యాపారవేత్త. ఒక పక్క భార్య నిర్వాకం, మరో పక్క డ్రైవర్ బెదిరింపులతో *అయోమయానికి గురైన వ్యాపారవేత్త.. పోలీసులను ఆశ్రయించారు* . డ్రైవర్ నిర్వాకంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version