కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడి మృతి చెందగా కుటుంబానికి చేయూత

కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడి మృతి చెందగా కుటుంబానికి చేయూత

* జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 14 ప్రశ్న ఆయుధం*

చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితుడు మృతి చెందగా తన కుటుంబానికి ఆర్థిక చేయూతన అందించాలని ఉద్దేశంతో మృతి చెందిన వ్యక్తి స్నేహితులు 15వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేటి తరుణంలోచిన్నతనంలో తమతో పాటు చదువుకున్న మిత్రుడు అనారోగ్యంతో మృత్యువాత పడటంతో స్నేహితులంతా కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాముల పల్లి గ్రామానికి చెందిన రామంచ సుక్కయ్య అనే యువకుడు గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇల్లందకుంట హైస్కూల్లో 1990-91 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న స్నేహితులంతా కలిసి మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని ఉద్దేశంతో 15 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎదులాపురం అశోక్ గుండ కేదారి గారంపల్లి ఆనందరావు మహారాజ్ రమేష్. తిప్పారపు తుక్కారావు కొమురయ్య జితేందర్ రాజేందర్ మల్లయ్య దామోదర్ రాము నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment