Site icon PRASHNA AYUDHAM

చేపల వేటకు వెళ్లిన రైతు- నిజాంసాగర్ నీటిలో మునిగి మృతి

IMG 20251012 WA0083 1

IMG 20251012 WA00842

ఎల్లారెడ్డి, అక్టోబర్ 12, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండ సంగయ్య (52) తండ్రి పేరు పాపయ్య అనే రైతు ఈరోజు ఉదయం నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.

సంగయ్య, పాపయ్య కుమారుడు కాగా, కుర్మ వర్గానికి చెందినవాడు. వృత్తిగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాధారణంగా చేపల వేటకు వెళ్తూ ఉండే సంగయ్య ఈరోజు కూడా అదే ఉద్దేశంతో వేటకు బయలుదేరి వెల్లి తిరిగి రాలేదు. కొంతసేపటి తరువాత ఆయన మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ బోజ్జా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version