ఘనంగా ఎడ్ల పొలాల పండగ
పొలాల అమావాస్య సందర్భంగా పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో ఉత్సాహం
ఎడ్లను, ఆవులను అలంకరించి ప్రత్యేక పూజలు
ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు
బాజాభజంత్రీలతో ఊరేగింపు, కళ్యాణం కార్యక్రమం
గ్రామ ప్రజలంతా ఏకతాటిపై పాల్గొని ఆనందోత్సాహం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22
పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో పోలాల అమావాస్య పురస్కరించుకొని రైతులు ఘనంగా ఎడ్ల పొలాల పండగను జరుపుకున్నారు. గ్రామ రైతులు తమ ఎడ్లను, ఆవులను అందంగా అలంకరించి ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, బాజాభజంత్రీలతో ఊరేగింపుగా వీధుల గుండా తీసుకెళ్లారు. చివరగా ఎద్దులకు ప్రతీకాత్మకంగా కళ్యాణం కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఉత్సవంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, పిల్లలు అందరూ పాల్గొని సాంప్రదాయ శైలిలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు.