ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ యం, సబ్ ఇంజినీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలి

●TVAC-JAC సలహాదారు మరియు చైర్మన్ A.మహేందర్ రెడ్డి,B స్వామి 

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 24 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

తూప్రాన్ మండల లోని పోతారాజ్ పల్లి కామన్ వద్ద TVAC-JAC ఆధ్వర్యంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆర్టిజన్స్ కాన్వర్షన్ చేసే వరకు జేయల్ఏం, సబ్ ఇంజనీర్ పోస్టులు భర్త నిలిపివేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ రెగ్యులరైజేషన్ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుపుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పక్కన పెట్టి జేయల్ఏం, సబ్ ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయిo చడం సబబు కాదని అన్నారు. ఇదే జరుగుతే ప్రస్తుతం పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని వారు అన్నారు .కావున ఆర్టిజన్ కార్మికులందరికీ ముందు కన్వేషన్ చేసి అ తరువాత జేయల్ఎం, సబ్ ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు.ఇదే విషయమై TVAC-JAC ఈ నెల 26వ తేదీన ఛలో సీయమ్ డి కార్యాలయం ముందు ధర్నా ను చేపడుతున్నామని తెలియజేశారు.ఈ ధర్నాకి మెదక్ జిల్లాలోని ఆర్టిజన్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో TVAC-JAC ఆర్గనైజింగ్ సెకరటరీ రాజ్ కుమార్,TS UEEU(CITU) జిల్లా అధ్యక్షులు యం. నర్సింహులు,TS UEEU(CITU) నాయకులు హన్మంత్,జీవన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now